సోమవారం 06 జూలై 2020
Sports - Apr 30, 2020 , 10:43:12

ప్రేక్ష‌కుల్లేకుండానే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి

ప్రేక్ష‌కుల్లేకుండానే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి

వియ‌న్నా:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా విశ్వవ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీర‌ద్దైన క్ర‌మంలో జూలై 5 నుంచి ప్రారంభం కానున్న `ఆస్ట్రియా గ్రాండ్ ప్రి` ప్రేక్ష‌కులు లేకుండా జ‌రపాల‌ని నిర్వాహ‌కులు నిర్ణ‌యించారు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టే విధంగా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌డుతూ రేస్ కొన‌సాగిస్తాని పేర్కొన్నారు. 

`క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తూ ఎంపిక చేసిన కొన్ని రేసుల‌ను మాత్ర‌మే నిర్వ‌హించాల‌నుకుంటున్నాం. వాటిని కూడా ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రుపుతాం. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గేంత వర‌కు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశాలున్నాయి` అని రేస్ నిర్వాహ‌కులు తెలిపారు.


logo