ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 03, 2021 , 01:15:55

దక్షిణాఫ్రికాలో ఆసీస్‌ పర్యటన వాయిదా

దక్షిణాఫ్రికాలో ఆసీస్‌ పర్యటన వాయిదా

సిడ్నీ: కరోనా వైరస్‌ భయంతో ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో జరుగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసు నుంచి ఆసీస్‌ తప్పుకుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం కంగారూ జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితిలో అది అంత శ్రేయస్కరం కాదని భావించి వాయిదా వేసుకుంది. ‘ఇప్పుడున్న స్థితిలో ఆసీస్‌ నుంచి దక్షిణాఫ్రికాకు ప్రయాణించడం మా ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి సురక్షితం కాదు. వైద్య బృందంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం’అని క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నిక్‌ హాక్లీ మంగళవారం వెల్లడించారు.


VIDEOS

logo