సోమవారం 25 మే 2020
Sports - May 23, 2020 , 19:31:36

'ఆ పని చేస్తే ఆసీస్‌ స్పిన్‌ బౌలింగ్‌ బతుకుంది'

'ఆ పని చేస్తే ఆసీస్‌ స్పిన్‌ బౌలింగ్‌ బతుకుంది'

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలింగ్‌ ప్రస్తుతం వేగంగా పతమనమవుతున్నదని ఆస్ట్రేలియా దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. స్పిన్‌ను బతికించేందుకు, పునర్వైభవం తెచ్చేందుకు ప్రతి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో తప్పకుండా స్పిన్నర్లను ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు శనివారం  ఓ ఇంటర్వ్యూ ద్వారా సూచించాడు.

"పరిస్థితులు ఎలా ఉన్న జట్టు తరఫున ఒక్క స్పిన్నర్‌ అయినా మ్యాచ్‌లో తప్పక ఆడాలి. అలాగైతే తొలి రోజు, నాలుగో రోజు ఎలా బౌలింగ్‌ చేయాలో అతడు నేర్చుకోగలడు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తేనే స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంటున్నారు. దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు అవకాశమివ్వకపోతే వారు ఎలా నేర్చుకుంటారు? అందుకే ప్రతి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లకు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత స్టేట్స్‌ జట్లపై ఉంది. లేకపోతే క్రికెట్‌ ఆస్ట్రేలియా రంగ ప్రవేశం చేయాలి. లేకపోతే ప్రస్తుతం వేగంగా పతనమవుతున్న స్పిన్‌ బౌలింగ్‌.. మరింత దిగజారుతుంది' అని షేన్‌ వార్న్‌ అన్నాడు. ప్రస్తుతం నాథన్‌ లయాన్‌ ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసేలా స్పిన్నర్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని వార్న్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఆరు రాష్ట్రాల జట్లు ఉన్నాయి.  


logo