బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 11:48:57

టీమిండియాను స‌ర్క‌స్‌లో జంతువుల‌లాగా చూశారు!

టీమిండియాను స‌ర్క‌స్‌లో జంతువుల‌లాగా చూశారు!

చెన్నై: ఆస్ట్రేలియాలో ఇండియ‌న్ టీమ్‌ను స‌ర్క‌స్‌లో జంతువుల‌లాగా చూశార‌ని, టీమ్‌ను మాన‌సికంగా దెబ్బ కొట్ట‌డానికి అక్క‌డి క్రికెట్ అభిమానులు, మీడియా ప్ర‌య‌త్నించార‌ని స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ వెల్ల‌డించాడు. త‌న యూట్యూబ్ చానెల్‌లో ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్‌తో చాట్ సంద‌ర్భంగా.. గ‌బ్బా కోట‌ను ఇండియ‌న్ టీమ్ ఎలా బ‌ద్ధ‌లు కొట్ట‌గ‌లిగిందో చెప్పాడు. బ్రిస్బేన్‌కు రావ‌డానికి టీమిండియా భ‌య‌ప‌డుతోంద‌న్న ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నాల‌కు కూడా అశ్విన్ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు. బ్రిస్బేన్ టెస్ట్ చారిత్ర‌క విజ‌యానికి సిడ్నీలోనే తొలి అడుగు ప‌డింద‌ని ఈ సంద‌ర్భంగా అశ్విన్ చెప్పాడు. 

చివ‌రి రోజు అశ్విన్‌, విహారి 42 ఓవ‌ర్ల పాటు అసాధార‌ణ పోరాటం చేసి.. ఆ మ్యాచ్ డ్రాగా ముగియ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. ఇదే సానుకూల దృక్ప‌థంతో.. టీమిండియా బ్రిస్బేన్‌లో సంచ‌ల‌న విజయం సాధించిన‌ట్లు అశ్విన్ చెప్పాడు. ఇక ఈ టూర్‌కు ఇండియా కంటే ఎక్కువ‌గా ఆస్ట్రేలియానే సిద్ధ‌మైంద‌ని, అయితే మొత్తం నాలుగు టెస్టుల్లోనూ ఆ టీమ్ త‌మ న‌లుగురు ప్ర‌ధాన బౌల‌ర్ల‌నే కొన‌సాగించి పొర‌పాటు చేసింద‌ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్ అన్నాడు. 

VIDEOS

logo