సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రి అయ్యాడు. ఫించ్ భార్య అమీ మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఫించ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘మా లిటిల్ ప్రిన్సెస్ ఎస్తర్ కేట్ ఫించ్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతం’ అని ఆసీస్ కెప్టెన్ రాసుకొచ్చాడు. ఫించ్-అమీ 2018లో వివాహం చేసుకున్నారు.