శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 14:25:42

క్రికెట్ బంతికి శానిటైజ‌ర్ రాసినందుకు గాను ఆస్ట్రేలియన్ పేస‌ర్ స‌స్పెండ్‌

క్రికెట్ బంతికి శానిటైజ‌ర్ రాసినందుకు గాను ఆస్ట్రేలియన్ పేస‌ర్ స‌స్పెండ్‌

గత నెలలో మిడిల్‌సెక్స్‌తో జ‌రిగిన బాబ్ విల్లిస్ ట్రోఫీ మ్యాచ్‌లో క్రికెట్ బంతికి హ్యాండ్ శానిటైజర్ రాసినందుకు గాను ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌల‌ర్ మిచ్ క్లేడాన్‌ను ఇంగ్లీష్‌ కౌంటీ క్లబ్ సస్సెక్స్ జ‌ట్టు సస్పెండ్ చేసింది. దీంతో ఈ 37 ఏళ్ల ఆస్ట్రేలియన్ పేస‌ర్‌కు సర్రేతో జ‌రుగ‌నున్న త‌దుప‌రి ఆట‌లో పాల్గొనే అవ‌కాశం లేకుండా పోయింది.  

"మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిపై హ్యాండ్ శానిటైజర్‌ను రాశాడ‌ని ఈసీబీ ఆరోపణల నిమిత్తం మిచ్ క్లేడాన్‌ను స‌స్పెండ్ చేశాం. ఈ విష‌య‌మై ఇంత‌కుమించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ద‌లుచుకోలేదు” అని సస్సెక్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో క్లేడాన్ ఈ చర్యకు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. ఆ మ్యాచ్‌లో అత‌డు మూడు వికెట్లు పడగొట్టాడు. క్లేడాన్ మంచి ఫాస్ట్ బౌలర్ అత‌డు. 112 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 110 లిస్ట్-ఏ గేమ్స్‌, 147 టీ20ఐలు ఆడాడు. అతడు 310 ఎఫ్‌సీ వికెట్లు, లిస్ట్ ఏ, టీ20లలో క్లేడాన్ వరుసగా 138, 159 వికెట్లు సాధించాడు. క్లేడాన్ ప్రాతినిధ్యం వహించిన మూడో కౌంటీ జట్టు సస్సెక్స్.  ఇదిలా ఉంగా బంతికి లాలాజ‌లాన్ని రాయ‌డం కూడా నిషేధం అని ఐసీసీ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo