మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 26, 2020 , 00:55:33

ప్లిస్కోవాకు షాక్‌

ప్లిస్కోవాకు షాక్‌
  • మూడో రౌండ్‌లోనే ఓటమిపాలైన రెండో సీడ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనాల పరంపర కొనసాగుతున్న ది. ఇప్పటికే డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమీ ఒసాక, అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ నిష్క్రమించగా.. తాజాగా రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఐదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) సైతం ఇంటిబాట పట్టారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ప్లిస్కోవా 6-7 (4/7), 6-7 (3/7)తో 30వ సీడ్‌ అనస్టాసియా పావ్లుచెన్కోవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ స్వితోలినాకు ఊహించని పరాభవం ఎదురైంది. మూడో రౌండ్‌లో స్వితోలినా 1-6, 2-6తో అన్‌సీడెడ్‌ గార్బిన్‌ ముగురుజ (స్పెయిన్‌) చేతిలో ఓడింది. నాలుగో సీడ్‌ హలెప్‌ 6-1, 6-4తో పుతిన్సేవ (కజకిస్థాన్‌)పై గెలిచింది.


నాదల్‌ అడుతూ పాడుతూ..

ప్రపంచ టాప్‌ ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) అడుతూ పాడుతూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో రఫా 6-1, 6-2, 6-4తో తన దేశానికే చెందిన 


కరెనో బుస్టాపై గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-2, 6-4, 6-7 (5/7), 6-4తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై కష్టపడి గెలిచాడు. నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-4, 6-3, 6-2తో అలెక్సో పోప్రిన్‌ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-2, 6-2, 6-4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)పై వరుస సెట్లలో విజయాలు సాధించారు. ఆమెరికన్‌ నిక్‌ కైర్గియోస్‌ 6-2, 7-6 (7/5), 6-7 (6/8), 6-7 (7/9), 7-6 (10/8) తో దాదాపు నాలుగున్నర గంటలపాటు పోరాడి కరేన్‌ కచనోవ్‌ (రష్యా)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ముందడుగేశాడు. 


logo
>>>>>>