బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 08:29:33

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. క్వార్టర్‌ ఫైనల్‌కు ఒసాకా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. క్వార్టర్‌ ఫైనల్‌కు ఒసాకా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సింగిల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి, వరల్డ్‌ నెంబర్‌ త్రీ నయోమి ఒసాకా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఆదివారం మెల్బోర్న్‌ రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన గార్బిన్ ముగురుజాను 6-4, 4-6, 7-5 తేడాతో ఓడించి ఒసాకా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మొదటి సెట్‌ను 6-4తో కైవసం చేసుకొని మంచి ఆరంభాన్ని అందుకుంది. రెండో సెట్‌లో ఒసాకా రెండు పాయింట్లతో వెనక్కి వెళ్లినా.. మూడో సెట్‌లో 7-5 తేడాతో విజయాన్ని అందుకుంది. నాలుగో రౌండ్‌లో సెరెనా విలియమ్స్‌ సబలెంకతో పోటీపడనుంది. అలాగే పురుషుల నాలుగో రౌండ్ మ్యాచ్‌లో నోవాక్ జొకోవిచ్ - డొమినిక్ థిమ్ పోటీపడనున్నారు.

VIDEOS

logo