సోమవారం 18 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 11:04:41

సిరాజ్‌పై మ‌ళ్లీ నోరు పారేసుకున్న ఆస్ట్రేలియా అభిమానులు.. వీడియో

సిరాజ్‌పై మ‌ళ్లీ నోరు పారేసుకున్న ఆస్ట్రేలియా అభిమానులు.. వీడియో

సిడ్నీ: ఆస్ట్రేలియా అభిమానుల నోటి దురుసుకు అంతే లేకుండా పోతోంది. పింక్ టెస్ట్ మూడో రోజు ఆట‌లో టీమిండియా ప్లేయ‌ర్స్ బుమ్రా, సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్య‌లు చేసిన ఆసీస్ ఫ్యాన్స్‌.. నాలుగో రోజు కూడా నోటికి ప‌ని చెప్పారు. ఈసారి బౌండ‌రీ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను వెనుకాల స్టాండ్స్‌లో కూర్చున్న కొంత మంది అభిమానులు ఏదో అన్నారు. దీంతో అత‌డు నేరుగా కెప్టెన్ ర‌హానే ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెప్పాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి అంపైర్ పాల్ రైఫిల్‌కు ఫిర్యాదు చేశారు. అప్ప‌టిక‌ప్పుడు పోలీసులు రంగంలోకి దిగి స్టాండ్స్‌లో కూర్చున్న ఫ్యాన్స్‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. 

ఈ ఘ‌ట‌న‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియ‌స్ అయ్యాడు. మీరు చేస్తే వెట‌కారం.. అవ‌త‌లి వాళ్లు చేస్తే జాత్యాహంకారం. సిడ్నీలో కొంత‌మంది ఆస్ట్రేలియా అభిమానులు తీరు దారుణంగా ఉంది. మంచి టెస్ట్ సిరీస్‌ను పాడు చేస్తున్నారు  అని వీరూ ట్వీట్ చేశాడు.