శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 12:04:15

ఆటగాడిగా నా కథ ముగిసింది: కామెరూన్‌ వైట్‌

 ఆటగాడిగా నా కథ ముగిసింది: కామెరూన్‌ వైట్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ కామెరూన్‌ వైట్‌ క్రికెట్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని ముగించాడు.  వైట్‌ తాజాగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 37 ఏండ్ల కామెరూన్‌ ఆస్ట్రేలియా తరఫున నాలుగు టెస్టులు, 91 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. విక్టోరియా, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ సహా అనేక క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.  విధ్వంసక బ్యాట్స్‌మన్‌, లెగ్‌స్పిన్నర్‌ వైట్‌ వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాడు.   20ఏండ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన వైట్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో 7  మ్యాచ్‌లకు   కెప్టెన్‌గా వ్యవహరించాడు. వైట్‌ ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు 

'నేను కచ్చితంగా ఆడటం ముగించాను. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున గత ఏడాది కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాను.  మరొక ఒప్పందం కుదరాలంటే మరింత బాగా ఆడాల్సి ఉటుంది.   నిజయితీగా చెప్పాలంటే ఆటగాడిగా నా కథ ముగిసింది. ఓ క్రికెటర్‌గా చాలా ఏండ్లు ఆడాను.  ఇక పూర్తిస్థాయి కోచ్‌గా మారాలని భావిస్తున్నా. దానిపైనే దృష్టి పెడతాను. కోచ్‌గా విజయవంతమవుతానో లేదో తెలియదు కానీ ప్రయత్నమైతే చేస్తానని' వైట్‌ పేర్కొన్నాడు. 


logo