సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 13:35:07

కోహ్లీసేన‌కు ప‌రాభ‌వం.. ఆసీస్‌కు ఆధిక్యం

కోహ్లీసేన‌కు ప‌రాభ‌వం.. ఆసీస్‌కు ఆధిక్యం

హైద‌రాబాద్‌: అడిలైడ్ టెస్టులో భార‌త్‌పై ఆస్ట్రేలియా సునాయాస విజ‌యాన్ని న‌మోదు చేసింది.  దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది.  90 ర‌న్స్ టార్గెట్‌తో ఇవాళ‌ రెండ‌వ ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు.. కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకున్నారు. 21 ఓవ‌ర్ల‌లో 93 ర‌న్స్ చేశారు. ఓపెన‌ర్ జో బ‌ర్న్స్ హాఫ్ సెంచ‌రీతో నాటౌట్‌గా నిలిచాడు.  అంత‌క‌ముందు మూడ‌వ రోజు తొలి సెష‌న్‌లో ఆసీస్ బౌల‌ర్లు త‌డాఖా చూపించారు.  శ‌ర‌వేగంగా బంతులు వేస్తూ.. భార‌త బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి టీమిండియా త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ర‌న్స్‌కే ఆలౌటైంది. హేజ‌ల్‌వుడ్ 5 వికెట్లు తీయ‌గా,  క‌మ్మిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. ష‌మీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.  స్వ‌ల్ప ల‌క్ష్యంతో చేజింగ్ దిగిన ఆస్ట్రేలియా అతి సునాయాసంగా టార్గెట్‌ను అందుకున్న‌ది.  8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న‌ది.  ఆసీస్ రెండ‌వ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 33, వేడ్ 51 ర‌న్స్ చేశారు. 

స్కోరు బోర్డు

ఇండియా  244 & 36

ఆస్ట్రేలియా 191 & 93/2


logo