బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 13:28:57

అండర్‌-19 వరల్డ్‌ కప్‌: భారత్‌ తొలి బ్యాటింగ్‌

అండర్‌-19 వరల్డ్‌ కప్‌: భారత్‌ తొలి బ్యాటింగ్‌

 పోచెస్ట్రూమ్‌:  ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత కుర్రాళ్లు మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా యువ భారత్‌.. ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ హార్వే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలో దిగి అంచనాలకు మించి రాణిస్తున్న భారత కుర్రాళ్లు అదే జోరుతో ఆసీస్‌ను మట్టికరిపించి సెమీస్‌లో చోటు దక్కించుకోవాలని  పట్టుదలతో ఉన్నారు. గ్రూప్‌ దశలో శ్రీలంక, జపాన్‌, న్యూజిలాండ్‌లను చిత్తుచిత్తుగా ఓడించిన టీమ్‌ఇండియా సూపర్‌ లీగ్‌కు అర్హత సాధించింది. 

బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌, దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్‌ వర్మ, ప్రియం గార్గ్‌, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌ జోరు మీదుంటే.. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌, ఆదిత్య అంకొలేకర్‌ విజృంభిస్తున్నారు. కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌ కూడా సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెకంజీ హర్వే నాయకత్వంలోని ఆసీస్‌ జట్టు కూడా నాణ్యమైన ఆటగాళ్లతో నిండి ఉండటంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పకపోవచ్చు. logo