శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 12:09:23

కివీస్‌, ఆసీస్ క్రికెట్ సిరీస్ కూడా ర‌ద్దు..

కివీస్‌, ఆసీస్ క్రికెట్ సిరీస్ కూడా ర‌ద్దు..

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న చాప‌ల్‌-హ్యాడ్లీ వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. ఆ రెండు సిరీస్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని భావించారు.  రెండు దేశాల మ‌ధ్య తొలి వ‌న్డే జ‌రిగినా.. మిగితా రెండు వ‌న్డేల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో..ఆ దేశ జ‌ట్టు స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ది.  బోర్డ‌ర్ ఆజ్ఞ‌లు విధించ‌డం వ‌ల్ల కివీస్ జ‌ట్టు స్వ‌దేశానికి ప‌య‌నం కానున్న‌ది.  మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ దేశం 14 రోజుల ఐసోలేష‌న్ పెట్టుకోవ‌డం వ‌ల్ల క్రికెట‌ర్లు స్వ‌దేశం వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. సిడ్నీలో రెండు దేశాల మ‌ధ్య ప్రేక్ష‌కుల లేకుండానే తొలి వ‌న్డే నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. వైర‌స్ సోకిన పేస్ బౌల‌ర్ లాకీ ఫెర్గూస‌న్‌ను ఐసోలేట్ చేసిన‌ట్లు కివీస్ క్రికెట్ బోర్డు పేర్కొన్న‌ది.  ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌ను కూడా క‌రోనా భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.


logo