బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 11:51:16

భారత్‌-ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా

భారత్‌-ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా

మెల్‌బోర్న్‌: వచ్చే నెలలో జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా పడింది. కరోనా కారణంగా వన్డేసిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదావేస్తున్నట్లు ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. జనవరిలో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడాల్సి ఉన్నది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మ్యాచ్‌లను నిర్వహించలేమని, దీంతో సిరీస్‌ను 2022 వరకు వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. వచ్చే సెషన్‌లో మూడు వన్డేల సిరీస్‌కు తోడు మూడు టీ20 మ్యాచ్‌లను చేర్చే ఆలోచనలో ఉన్నట్లు సీఏ అధ్యక్షుడు నిక్‌ హాక్లీ అన్నారు.  

కాగా, టీ20 మహిళా వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇరుజట్లు చివరిసారిగా పరస్పరం తలపడ్డాయి. మెల్‌బోర్న్‌ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టును ఆసీస్‌ ఓడించింది. అయితే ప్రస్తుతం భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. చెరో గెలుపుతో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి.  


logo