శనివారం 16 జనవరి 2021
Sports - Jan 06, 2021 , 19:48:00

అరంగేట్రానికి సిద్ధమైన నవదీప్‌ సైనీ

అరంగేట్రానికి సిద్ధమైన  నవదీప్‌ సైనీ

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో  మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ నవదీప్‌సైనీ టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు. బీసీసీఐ బుధవారం ప్రకటించిన టెస్టు జట్టులో సైనీకి చోటు దక్కింది. ఉమేశ్‌ యాదవ్‌ గాయంతో సిరీస్‌ నుంచి వైదొలగడంతో అతనికి అవకాశం వచ్చింది. జట్టులో చోటు కోసం నటరాజన్‌, శార్దుల్‌ ఠాకూర్‌ల నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది.

అయినప్పటికీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ 28ఏండ్ల నవదీప్‌వైపే మొగ్గుచూపింది. 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌! రేపు సిడ్నీ వేదికగా ఆరంభంకానున్న టెస్టులో నవదీప్‌సైనీ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని' బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. సైనీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా తీసిన వీడియోను ట్విటర్లో షేర్‌ చేసింది.