బుడాపెస్ట్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మైదానంలో తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులను తన పేరిట లిఖించుకున్న రొనాల్డో సోషల్ మీడియాపై కూడా తనదైన ముద్ర వేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 30 కోట్ల మంది ఫాలోవర్లను కల్గిన తొలి వ్యక్తిగా అరుదైన ఘనతను అందుకున్నాడు. గతంలో 20 కోట్ల మార్క్ కూడా ఈ స్టార్ స్ట్రయికర్ పేరు మీదే ఉండడం విశేషం. ఈ జాబితాలో రొనాల్డో తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ‘ద రాక్’ డ్వేన్ జాన్సన్ (24 కోట్లు), అరియాన గ్రాండె, కైలీ జెన్నర్, సెలీనా గోమెజ్ ఉన్నారు. భారత్ విషయానికొస్తే.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (12.8 కోట్లు), బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (6.45 కోట్లు) ఇన్స్టాగ్రామ్ టాప్‌లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండేండ్ల కాలంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా రొనాల్డో 50 మిలియన్ డాలర్లను ఆర్జించాడు. ఇది జువెంటస్ క్లబ్‌కు ఆడటం ద్వారా వచ్చే ఆదాయం (33మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ కావడం గమనార్హం.