మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 21:29:48

విల్‌ పుకోస్కీ ఔట్‌?

విల్‌ పుకోస్కీ ఔట్‌?

బ్రిస్బేన్:‌ భారత్‌తో మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ విల్‌ పుకోస్కీ నిర్ణయాత్మక ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. సిడ్నీ టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్‌ సమయంలో  పుకోస్కీ డైవ్‌ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై  నిర్ణయం తీసుకుంటామని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

ప్రస్తుతం విల్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడించింది.  పుకోస్కీ భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరిగడంతో నొప్పితో బాధపడుతున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విల్‌ 64, 8 స్కోర్లు  చేశాడు.  భారత్‌, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది.