బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 00:06:34

అతడొస్తానంటే.. నేనొద్దంటానా..

అతడొస్తానంటే.. నేనొద్దంటానా..

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి జట్టు పగ్గాలు అందుకోవాలనుకుంటే.. పూర్తి మద్దతిస్తానని ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ పేర్కొన్నాడు. రెండేండ్ల క్రితం బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో స్మిత్‌పై ఏడాది నిషేధంతో పాటు రెండేండ్ల నాయకత్వ నిషేధం పడ్డ విషయం తెలిసిందే. అది ఇటీవల ముగియడంతో స్మిత్‌ తిరిగి కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. ‘ఈ అంశపై స్మిత్‌తో చర్చించలేదు. ఒకవేళ అతడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనుకుంటే పూర్తి మద్దతిస్తా. స్మిత్‌ సూపర్‌ సారథి’అని పైన్‌ అన్నాడు. 

పైన్‌ క్రెడిట్‌ కార్డు చోరీ

ఇండోర్‌ జిమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు గ్యారేజీలో ఉన్న కారును రోడ్డు మీదపెడితే.. అందులో ఉన్న వాలెట్‌ను ఎవరో దొంగలించారని పైన్‌ మంగళవారం చెప్పాడు. ‘ఈ రోజు నిద్ర లేవగానే ఊహించని షాక్‌ తగిలింది. క్రెడిట్‌ కార్డు వినియోగించినట్లు వచ్చిన మెసేజ్‌ చూసి ఆశ్చర్యానికి గురయ్యా. గ్యారేజీని జిమ్‌గా మార్చుకోవడం కోసం కారును వీధిలో పెట్టిన విషయం గుర్తొచ్చి అక్కడికి వెళ్లి చూసేసరికి అందులో వాలెట్‌ లేదు. కారు డోర్‌ తెరిచి ఉంది’అని పైన్‌ వెల్లడించాడు.


logo