గురువారం 21 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 21:05:13

ఆస్ట్రేలియా కెప్టెన్‌ పైన్‌కు జరిమానా

ఆస్ట్రేలియా కెప్టెన్‌ పైన్‌కు జరిమానా

సిడ్నీ: భారత్‌తో మూడో టెస్టులో అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌కు జరిమానా పడింది. మూడోరోజు ఆటలో ఫీల్డ్‌ అంపైర్‌తో పైన్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 56వ ఓవర్లో జరిగింది.  అంపైర్‌తో పైన్‌ పరుషంగా మాట్లాడినట్లు తెలిసింది. 

మైదానంలో పైన్‌ వ్యవహరించిన తీరుపై ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌  బూన్‌కు ఫిర్యాదు చేశారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద  పైన్‌ మ్యాచ్‌ ఫీజులో 15శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు పైన్‌  క్రమశిక్షణా రికార్డులో  ఓ డీమెరిట్‌ పాయింట్‌ను చేర్చారు. 24 నెలల కాలంలో  పైన్‌ చేసిన మొదటి తప్పు ఇదేనని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

లెవల్‌-1 తప్పిదం కింద  అధికారిక మందలింపు,  ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా విధించొచ్చు. దీంతో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లు  వేసే అధికారం రిఫరీకి ఉంది.    

ఇవి కూడా చ‌ద‌వండి

'గాడ్సే' గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

ఫిట్ నెస్ కోసం హీరోయిన్లు ఏం చేసున్నారో తెలుసా...?

క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న‌ తొలి న‌టి ఎవ‌రంటే..?

పెండ్లి పీట‌లెక్కిన టాలీవుడ్ హీరోయిన్

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

త‌న పెళ్ళిపై ప్ర‌క‌ట‌న ఇచ్చిన బాలీవుడ్ హీరో


logo