మంగళవారం 19 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 17:48:58

తొలి వన్డేలో భారత్‌ ఓటమి

తొలి వన్డేలో భారత్‌ ఓటమి

సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో  మూడు వన్డేల సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ  సారథ్యంలోని భారత్‌కు ఆరంభంలోనే ఝలక్‌ తగిలింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  దీంతో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో  జరుగుతుంది. ఆసీస్‌ నిర్దేశించిన 375  పరుగుల భారీ ఛేదనలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది. 

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(90: 76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(74: 86 బంతుల్లో 10ఫోర్లు) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు.  ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ కోహ్లీ(21) నిరాశపరిచాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపిన కేఎల్‌ రాహుల్‌(12), శ్రేయస్‌ అయ్యర్‌(2) మిడిలార్డర్‌లో విఫలమయ్యారు. ఆతిథ్య బౌలర్ జోష్‌ హేజిల్‌వుడ్‌(3/55)  భారత్‌ను ఆదిలోనే భారీ దెబ్బకొట్టాడు.  మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా(4/54) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ  ఒత్తిడిలో పడేశాడు.  

అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది.  కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114:124 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌(105: 66 బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు)  అద్భుత శతకాలతో ఆకట్టుకోగా డేవిడ్‌ వార్నర్‌(69: 76 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో  రాణించడంతో ఆసీస్‌ రికార్డు స్కోరు సాధించింది.  ఆఖర్లో మాక్స్‌వెల్‌(45: 19 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో   స్కోరు   జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్లింది.  భారత బౌలర్లు దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మహ్మద్‌ షమీ ఒక్కడే మూడు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. బుమ్రా, సైనీ, చాహల్‌ తలో వికెట్‌ తీసినా కంగారూలను కట్టడి చేయలేకపోయారు.