మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 15 : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రెండు మార్గాలే కన్పిస్తున్నాయి. ఒకటి వ్యక్తిగత స్వీయ జాగ్రత్తలు, మరొకటి వ్యాక్సిన్. ప్రస్తు త తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడమే ఉత్తమ మార్గమని వై ద్యనిపుణులు చెబుతున్నారు. మొద ట్లో వ్యాక్సిన్‌కు ప్రజలు దూరంగా ఉన్నా.. హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు అందరూ వ్యాక్సిన్‌వైపు దృష్టి మరలించారు.
వ్యాక్సినేషన్ సెంటర్ల పెంపు..
మహబూబ్‌నగర్ జిల్లాలో సూపర్స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసేందుకు సెంటర్లను పెంచారు. రైతు బజార్, కూరగాయాల మార్కెట్, పండ్లు, పూలు, మటన్, చికెన్, కిరాణం, మద్యం దుకాణాలు, చిరు వ్యాపారులు, హెయిర్ కటింగ్, ఐరన్, ల్యాండ్రీ దుకాణాలు, హోటళ్లు, మెడికల్ దుకాణా లు, ఫార్మసీ వ్యక్తులకు, ఆటో, కాబ్ డ్రైవర్లకు సూపర్ స్ప్రె డర్ల కింద వ్యాక్సిన్ ఇస్తున్నారు. 18 నుంచి 45 ఏండ్ల లో పు ఉన్నా వ్యాక్సిన్‌కు అర్హులు. గతంలో సూపర్ స్ప్రెడర్లకు జిల్లాలో 6 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తుండగా, రెండు కేంద్రాలను అధికారులు పెంచారు. పది ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. బ్యాంకు, ఎక్సైజ్, విద్యుత్ శాఖ, ఐకేపీ, పోస్టల్ ఉద్యోగులతోపాటు మరికొన్ని శాఖల కు టీకా ఇస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 14,787 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 6,559 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వనపర్తి జిల్లాలో 8,182 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
10,756 మందికి..
నాగర్‌కర్నూల్, జూన్ 15 : జిల్లా వ్యాప్తంగా 10,756 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేశారు. మే 28వ తేదీ నుంచి జిల్లాలో నాలుగు కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మొదటి డోస్ అందజేస్తున్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలు, ఫర్టిలైజర్, రేషన్ డీలర్లు, సివిల్ సైప్లె, రైతు అనుబంధ సంస్థలో పనిచేసే వారిని మొదటగా జిల్లా వ్యాప్తంగా 3,419 మందిని గుర్తించినప్పటికీ ఆ తర్వాత కార్మికులు, కూరగాయల విక్రయదారులకు సైతం వ్యాక్సినేషన్ వేస్తున్నారు. కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట సీహెచ్‌సీల పరిధిలో రోజుకు 400 నుంచి 600 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు జిల్లా టీకాధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు. కాగా జిల్లాలో వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొదటి డోస్‌ను 1,02,268 మందికి, రెండో డోస్‌ను 21,035 మందికి వేశారు.