గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 16:10:54

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకు దక్కించుకున్న ఆస్ట్రేలియా

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకు  దక్కించుకున్న ఆస్ట్రేలియా

దుబాయ్‌:  ఇంగ్లాండ్‌తో ఆఖరిదైన  మూడో  టీ20లో ఆస్ట్రేలియా  5 వికెట్ల తేడాతో గెలుపొంది.  ఆతిథ్య ఇంగ్లాండ్‌  నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  ఫలితంగా ఇంగ్లాండ్‌   చేతిలో వైట్‌వాష్‌ నుంచి తప్పించుకున్నది.  చివరి టీ20లో గెలుపొందిన ఆసీస్‌(275 రేటింగ్‌ పాయింట్లు)  తాజాగా ఐసీసీ ప్రకటించిన మెన్స్‌  టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది. 

ఇంగ్లాండ్‌ 271 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్నది. రెండు జట్ల మధ్య కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉన్నది.  ఇక మూడో స్థానంలో భారత్‌ ఉండగా నాలుగు, ఐదు స్థానాల్లో పాకిస్థాన్‌, సౌతాఫ్రికా ఉన్నాయి. 


logo