శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 02, 2021 , 15:51:55

క‌రోనా ఎఫెక్ట్‌.. సౌతాఫ్రికా టూర్ ర‌ద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

క‌రోనా ఎఫెక్ట్‌.. సౌతాఫ్రికా టూర్ ర‌ద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: సౌతాఫ్రికాలో క‌రోనా సెకండ్ వేవ్‌, వైర‌స్‌ కొత్త వేరియంట్ కార‌ణంగా ఆ దేశ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌. ఈ మేర‌కు క్రికెట్ సౌతాఫ్రికాకు రాసిన లేఖ‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో సౌతాఫ్రికాకు వెళ్ల‌డం ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌, స‌పోర్ట్ స్టాఫ్‌, ఆసీస్ క‌మ్యూనిటీకి ఏమాత్రం మంచిది కాద‌ని ఆ లేఖ‌లో క్రికెట్ ఆస్ట్రేలియా స్ప‌ష్టం చేసింది. ఈ టూర్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఎన్నో ఏర్పాట్లు చేసింద‌ని, తాము కూడా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టూర్ కొన‌సాగించాల‌నే భావించినా ఇప్పుడు వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని తెలిపింది. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని, ముఖ్యంగా ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో టూర్ ర‌ద్దు చేసుకోవ‌డం త‌మ‌కు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సౌతాఫ్రికాలో మ‌ళ్లీ ఎప్పుడు ప‌ర్య‌టిస్తామో త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కావాల్సి ఉంది. 

VIDEOS

logo