బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 15:24:25

అడిలైడ్‌లో ఆసీస్‌ క్రికెటర్లకు క్వారంటైన్‌ తప్పనిసరి

అడిలైడ్‌లో ఆసీస్‌ క్రికెటర్లకు  క్వారంటైన్‌ తప్పనిసరి

సిడ్నీ:  వచ్చే వారం ఇంగ్లాండ్‌ పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్టు అడిలైడ్‌ ఓవల్‌ ప్రాంగణంలో ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్‌ పర్యటనకు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ ఆటగాళ్లు అడిలైడ్‌ ఓవల్‌లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. 

ఆటగాళ్లు, సిబ్బందికి వసతి, శిక్షణా ఏర్పాట్లను సౌత్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతున్న కంగారూలు సిరీస్‌ అనంతరం సౌత్‌ ఆస్ట్రేలియా మీదుగా దేశానికి తిరిగిరానున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అడిలైడ్‌ ఓవల్‌ హోటల్‌ను బయో సెక్యూర్‌ బబుల్‌ కోసం ఎంపిక చేశారు.


logo