Sports
- Dec 06, 2020 , 12:55:58
రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియాకు మరో దెబ్బ

సిడ్నీ: ఆస్ట్రేలియా టీమ్‌కు స్టార్ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే గాయాలతో డేవిడ్ వార్నర్, స్పిన్నర్ ఆస్టన్ అగార్ టీ20 సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా మిగిలిన రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలను కారణంగా చూపుతూ స్టార్క్ టీమ్ నుంచి వెళ్లిపోయాడు. కోచ్ జస్టిన్ లాంగర్ అతను వెళ్లిపోవడానికి అనుమతి ఇచ్చాడు. అతనికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామని, తిరిగి టీమ్‌లోకి రావడానికి ఎప్పుడు సరైన సమయమని అతడు భావిస్తాడో అప్పుడు స్టార్క్‌కు స్వాగతం చెబుతామని కోచ్ లాంగర్ అన్నాడు. ఇప్పటికే తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్‌కు స్టార్క్ లేకపోవడం పెద్ద దెబ్బే.
తాజావార్తలు
MOST READ
TRENDING