సోమవారం 03 ఆగస్టు 2020
Sports - Jul 09, 2020 , 17:28:45

ఐపీఎల్‌ ఆడటానికి ప్లాన్‌ చేసుకోండి!

ఐపీఎల్‌ ఆడటానికి ప్లాన్‌ చేసుకోండి!

సిడ్నీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తమ దేశ ఆటగాళ్లు పాల్గొనే అంశంపై  క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్పందించింది.   ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత  ఐపీఎల్‌లో  ఆడేందుకు సిద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా  క్రికెటర్లకు సీఏ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.    ఆసీస్‌ జట్టు తప్పనిసరిగా ఇంగ్లాండ్‌లో పర్యటించాలి. ఒకవేళ ఐపీఎల్‌ జరిగితే ఆసీస్‌ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతిస్తామని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపారు.  

అంతర్జాతీయ క్రికెట్‌ బాగుకోసం సెప్టెంబర్‌లో ఆసీస్‌ టీమ్‌ ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లాలన్నారు. అలాగే,  ఐపీఎల్‌ నిర్వహిస్తే  టోర్నీలో  పాల్గొనేందుకు మా ఆటగాళ్లను  విడుదల చేస్తామని లాంగర్‌ పేర్కొన్నారు.   గత కొంతకాలంగా  ప్రతిరోజూ ఐపీఎల్‌ నిర్వహణపై చర్చ జరుగుతూనే ఉందని పరిస్థితులను  బట్టి అది  మారుతూ ఉంటుందన్నారు.    ఆస్ట్రేలియాలోనూ టీమ్‌ఇండియా పర్యటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన  టీ20 వరల్డ్‌ కప్‌  వాయిదాపడనున్న  నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో పర్యటనకు సిద్ధం కావాలంటూ ఆటగాళ్లకు సీఏ సూచించిన  విషయం తెలిసిందే.  యూఏఈ, శ్రీలంక లేదా ఆసియాలో ఇంకెక్కడైనా ఐపీఎల్‌ జరిగినా ఆసీస్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ నుంచే వెళ్లొచ్చని సీఏ భావిస్తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo