మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 06:51:27

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం

ఆసీస్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు సిరాజ్ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ వార్న‌ర్‌ను 5 ప‌రుగుల‌కే పెవీలియ‌న్‌కు పంపాడు. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కాస్త ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. అయితే 7 ఓవ‌ర్ల‌లో 21/1 స్కోరుతో ఆట కొన‌సాగుతున్న స‌మ‌యంలో వ‌రుణుడు మ‌రోసారి అడ్డుప‌డ్డాడు.దీంతో ఆట‌కు బ్రేక్ ప‌డింది.

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో  రోహిత్ శ‌ర్మ తుది జ‌ట్టులోకి రాగా,  గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్‌ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. ఇక  ఆస్ట్రేలియా తరపున విల్‌ పకోవ్‌స్కీ  ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను 29 బంతుల్లో 14 ప‌రుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.


భారత్ : రహానే (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ.

ఆస్ట్రేలియా : పైన్‌ (కెప్టెన్‌), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.