బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 11:16:30

పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఆస్ట్రేలియా.. 6 వికెట్లు డౌన్‌

పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఆస్ట్రేలియా.. 6 వికెట్లు డౌన్‌

మెల్‌బోర్న్‌: బాక్సింగ్ డే టెస్ట్‌లో చారిత్రక విజ‌యం దిశ‌గా టీమిండియా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 131 ప‌రుగుల ఆధిక్యం సంపాదించిన భార‌త్‌.. రెండో ఇన్నింగ్స్‌లో స‌గానికిపైగా ఆస్ట్రేలియా టీమ్‌ను పెవిలియ‌న్‌కు పంపించేసింది. టీ స‌మ‌యానికి 2 వికెట్ల‌కు 65 ప‌రుగులు చేసిన ఆసీస్‌.. చివ‌రి సెష‌న్‌లో వ‌రుస‌గా వికెట్లు కోల్పోతోంది. 99 ప‌రుగుల ద‌గ్గ‌ర 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. టీ త‌ర్వాత స్మిత్ (8), వేడ్ (40), ట్రెవిస్ హెడ్ (17), కెప్టెన్ పేన్ (1) ఇప్ప‌టికే పెవిలియ‌న్ చేరారు. టీ త‌ర్వాత జ‌డేజా 2, అశ్విన్‌, సిరాజ్ చెరొక వికెట్ తీశారు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వెనుక‌బ‌డే ఉంది. 


logo