మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 14:53:44

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

క్యాన్‌బెరా: ఇండియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. 303 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌.. విజ‌యం కోసం పోరాడుతోంది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ లాబుషేన్ (7), స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22), కెప్టెన్ ఫించ్ (75) వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్‌పై భార‌త్ పట్టు బిగించిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనే వ‌న్డే అరంగేట్రం చేసిన న‌ట‌రాజ‌న్ తొలి వికెట్ తీయ‌గా.. ఆ త‌ర్వాతి రెండు వికెట్లు శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి. టాప్ ఫామ్‌లో ఉన్న ఫించ్‌ను జ‌డేజా ఔట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 26 ఓవ‌ర్లలో 4 వికెట్ల‌కు 133 ప‌రుగులు చేసింది. విజ‌యం కోసం ఇంకా 170 ప‌రుగులు చేయాల్సి ఉంది. 


logo