మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 09:53:02

బాక్సింగ్ డే టెస్ట్‌.. ప‌ట్టు బిగిస్తున్న టీమిండియా

బాక్సింగ్ డే టెస్ట్‌.. ప‌ట్టు బిగిస్తున్న టీమిండియా

మెల్‌బోర్న్‌:  బాక్సింగ్ డే టెస్ట్‌పై టీమిండియా క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేసిన భార‌త్‌.. త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. మూడో రోజు టీ స‌మ‌యానికి ఆసీస్ 2 వికెట్ల‌కు 65 ప‌రుగులు చేసింది. ఇప్ప‌టికీ 66 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉంది. జో బ‌ర్న్స్ (4), లాబుషేన్ (28) ఔట‌య్యారు. మాథ్యూ వేడ్ (27), స్టీవ్ స్మిత్ (6) క్రీజులో ఉన్నారు. ఉమేష్‌, అశ్విన్ చెరొక వికెట్ తీసుకున్నారు. అయితే కీల‌క స‌మ‌యంలో ఉమేష్ యాద‌వ్ గాయ‌ప‌డి బ‌య‌టికి వెళ్లిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అత‌ను తిరిగి బౌలింగ్ చేయ‌గ‌ల‌డా లేదా అన్న‌ది ఇంకా తెలియ‌లేదు.


logo