ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 05, 2020 , 12:36:16

థ్రిల్లింగ్ విన్ అంటే ఇదే.. 2 పరుగుల తేడాతో గెలుపు

థ్రిల్లింగ్ విన్ అంటే ఇదే.. 2 పరుగుల తేడాతో గెలుపు

సౌతాంప్టన్‌:  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ బోణీ కొట్టింది. శుక్రవారం రాత్రి  ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌  గెలుపొందింది. ఒకానొక దశలో  ఆసీస్‌ గెలిచేలా కనిపించినా   ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్  2 పరుగుల తేడాతో  అద్భుత విజయాన్నందుకుంది. 

163 పరుగుల లక్ష్యఛేదనలో   ఆస్ట్రేలియా విజయానికి  ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది.  టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న  స్టాయినీస్‌ ఒక్క పరుగు కూడా సాధించలేదు. రెండో బంతిని అతడు భారీ సిక్సర్‌ కొట్టాడు. మళ్లీ మూడో బంతికి పరుగు రాకపోవడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది.   ఆఖరి మూడు బంతులకు వరుసగా 2,2,2 పరుగులు రావడంతో కేవలం 2 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌  గెలుపొందింది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(58), అరోన్‌ ఫించ్‌(46), మార్కస్‌ స్టాయినీస్‌(23) మాత్రమే రాణించారు. 98/1తో పటిష్టంగా కనిపించిన ఆసీస్‌ ఆతిథ్య  బౌలర్ల ధాటిగా వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకొని మ్యాచ్‌ను చేజార్చుకున్నది.  9 పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 రన్స్‌ చేసింది.   ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(44), మలన్‌(66) విజృంభించారు. 


logo