ఢాకా: ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ ఎల్లిస్.. పురుషుల టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌లో ఢాకాలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడినా.. ఆ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. గాయపడ్డ రిలే మెరిడిత్ స్థానంలో బరిలోకి దిగిన నాథన్.. వరుస బంతుల్లో మహ్మదుల్లా, మహేది హసన్, ముస్తాఫిర్ రెహ్మాన్‌లను ఔట్ చేశాడు. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 117 రన్స్ మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 3-0 ఆధిక్యాన్ని సాధించింది.
స్కోరు బోర్డు
బంగ్లాదేశ్ 127-9 (20 ఓవర్లు): మహ్మదుల్లా 52 (53); ఎల్లిస్ 3-34
ఆస్ట్రేలియా 117-4 (20 ఓవర్లు): మార్ష్ 51 (47), వేడ్ 35 (41)