బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 28, 2020 , 02:30:05

ఆసీస్‌ మహిళలదే సిరీస్‌

ఆసీస్‌ మహిళలదే సిరీస్‌

బ్రిస్బేన్‌: న్యూజిలాండ్‌తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే అలెన్‌ బోర్డర్‌ ఫీల్డ్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ 8 వికెట్లతో గెలచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది.అనంతరం హేన్స్‌ (40 నాటౌట్‌), అలిస్సా హిలీ (33) రాణించడంతో ఆసీస్‌ 16.4 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

ధోనీని దాటిన హిలీ

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీ అత్యధిక ఔట్ల రికార్డును ఆస్ట్రేలియా క్రికెటర్‌ అలిస్సా హిలీ అధిగమించింది. 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ధోనీ 91 ఔట్లు (57 క్యాచ్‌లు, 34 స్టంప్‌లు) చేయగా, కివీస్‌తో మ్యాచ్‌లో రెండు ఔట్‌లలో పాలుపంచుకోవడం ద్వారా హిలీ 114 మ్యాచ్‌ల్లో 92 (42 క్యాచ్‌లు, 50 స్టంప్‌లు)తో కొత్త రికార్డు నెలకొల్పింది.logo