సోమవారం 30 నవంబర్ 2020
Sports - Sep 27, 2020 , 01:10:33

ఆస్ట్రేలియా శుభారంభం

ఆస్ట్రేలియా శుభారంభం

  • తొలి టీ20లో కివీస్‌ మహిళలపై విజయం

బ్రిస్బేన్‌: టీ20 ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా మహిళల జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తమ పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (61), బౌలింగ్‌లో షుట్‌(4/23) రాణించడంతో శనివారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో  ఆసీస్‌ 17పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో ఆష్లే దూకుడుగా ఆడడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్‌ డివైన్‌ (29), సూజీ బేట్స్‌ (33) రాణించడంతో ఓ దశలో దూసుకెళ్లిన కివీస్‌ తర్వాత తడబడింది. చివరకు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 121 పరుగులకే పరిమితమైంది.