మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 08, 2020 , 11:45:58

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను తమ బౌలర్లు కట్టడి చేస్తారని..లక్ష్య ఛేదనలోనూ సత్తాచాటుతామని భారత అమ్మాయిల సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే ఫైనల్‌ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకొని సమష్టిగా రాణిస్తామని కౌర్‌ పేర్కొంది. 

టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌ చేరిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. మహిళల క్రికెట్లో అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా నిలిచిన  షెఫాలీ వర్మపై అందరి దృష్టి ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఏకంగా ఆరు ప్రపంచకప్‌ టోర్నీల్లో నాలుగుసార్లు విజేతగా నిలువడంతో ఆతిథ్య జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. logo
>>>>>>