శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 01:16:58

భారత వాణిజ్య రాయబారిగా హెడెన్‌

భారత వాణిజ్య రాయబారిగా హెడెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హెడెన్‌ భారత్‌కు వాణిజ్య రాయబారిగా ఎంపికయ్యాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్ట పరిచేందుకు ఆ దేశ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. అందులో హెడెన్‌తో పాటు భారత సంతతికి చెందిన రాజకీయవేత్త లిసా సింగ్‌ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిస్‌ పేనే ఉత్తర్వులు జారీ చేశారు. ఆసీస్‌ తరఫున 103 టెస్టులు, 161 వన్డేలు ఆడిన హెడెన్‌.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.


logo