మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 16:19:17

భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్లు ఇవే..!

భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్లు ఇవే..!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో   భారత క్రికెట్‌ జట్టు   పర్యటన షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే.ఆసీస్‌ పర్యటనలో  భారత్‌  మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27న వన్డే మ్యాచ్‌తో సిరీస్‌ ఆరంభంకానుంది. భారత్‌తో సిరీస్‌కు వన్డే, టీ20 జట్లను ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఇవాళ ప్రకటించింది.  యువ ఆల్‌రౌండర్‌ కెమెరాన్‌ గ్రీన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌  జట్టులోకి పునరాగమనం చేశాడు. 

ఆసీస్‌ వన్డే, టీ20 జట్లు:

అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, ఆష్టన్‌ అగర్‌, అలెక్స్‌  కేరీ, పాట్‌ కమిన్స్‌(వైస్‌ కెప్టెన్‌), కెమెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, హెన్రిక్స్‌, లబుషేన్‌, మాక్స్‌వెల్‌, డేనియల్‌ శామ్స్‌, కేన్‌ రిచర్డ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టాయినీస్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా