గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 00:35:25

పెర్రీ,తవుమా బంధానికి బ్రేక్‌

పెర్రీ,తవుమా బంధానికి బ్రేక్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎలీస్‌ పెర్రీ.. తన భర్త మ్యాట్‌ తవుమా నుంచి విడాకులు తీసుకుంది. రగ్బీ ఆటగాడైన తవుమాను 2015 డిసెంబర్‌లో వివాహమాడిన పెర్రీ నాలుగున్నరేండ్ల తర్వాత తమ బంధానికి వీడ్కోలు పలికింది. ఏడాది కాలంగా వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ జంట అధికారికంగా తాము విడిపోయినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ జోడీ ఆదివారం ఓ ఉమ్మడి ప్రకటన చేసింది. ‘పరస్పర గౌరవంతోనే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు’ అని పేర్కొంది. 


logo