స్మిత్ సెంచరీ .. ఆస్ట్రేలియా 338 ఆలౌట్

సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (131; 16 ఫోర్స్) అజేయ శతకం సాధించడంతో ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 166/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా వెంటవెంటనే వికెట్స్ కోల్పోయింది. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4) , మాథ్యూ వేడ్( 13;2 ఫోర్స్), గ్రీన్ (0: 21 బంతుల్లో), పైనే(1) ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా పెవీలియన్ బాట పట్టారు. స్టార్క్ ( 24; 2 ఫోర్స్, 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇక చివరలో స్మిత్ తన బ్యాట్‌ని ఝుళిపించడంతో భారీగా రన్స్ వచ్చాయి. జడేజా అద్భుతమైన త్రో వలన స్మిత్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్స్‌లో జడేజా నాలుగు వికెట్స్ తీయగా, బుమ్రా,సైనీ రెండు వికెట్స్, సిరాజ్‌కు ఓ వికెట్ దక్కించుకున్నారు. ఇక అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్‌పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్