బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 11:23:33

టీ స‌మ‌యానికి ఆస్ట్రేలియా 93/1

టీ స‌మ‌యానికి ఆస్ట్రేలియా 93/1

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీం ప‌ట్టు బిగించింది. ఓపెన‌ర్ పకోస్కి(54) అర్ధ సెంచ‌రీతో పాటు లబుషేన్‌(34) నిల‌క‌డ బ్యాటింగ్‌తో ఆసీస్ టీ స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోయి 93 ప‌రుగులు చేసింది. వ‌ర్షం అంత‌రాయం క‌లిగించడం వ‌ల‌న కాస్త ఆల‌స్యంగా ఆట ప్రారంభం కాగా, ఆరంభంలోనే వార్న‌ర్ ఔట‌య్యాడు. సిరాజ్ వేసిన అద్భుత‌మైన బంతికి స్లిప్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి  5 ప‌రుగుల‌కే పెవీలియ‌న్ బాట ప‌ట్డాడు.

లంచ్ త‌ర్వాత ప‌కోస్కి, ల‌బుషేన్‌లు భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. నిల‌క‌డగా బ్యాటింగ్ చేస్తూ చెత్త బంతిని బౌండ‌రీకు త‌ర‌లించారు. ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్స్‌కు చెరో లైఫ్ రావ‌డంతో వారు మ‌రింత పుంజుకున్నారు. ఈ క్ర‌మంలోనే తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ప‌కోస్కి అర్ధ సెంచ‌రీ చేశారు. 


logo