ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 20:04:39

ఆసీస్‌ తడ'బ్యాటు'..వణికిస్తున్న ఇంగ్లీష్‌ బౌలర్లు

ఆసీస్‌ తడ'బ్యాటు'..వణికిస్తున్న ఇంగ్లీష్‌  బౌలర్లు

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో  తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా తడబడుతున్నది. ఈ మ్యాచ్‌లో  బౌలర్ల హవా కొనసాగుతోంది.ఆతిథ్య ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు.  మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లతో విజృంభించడంతో ఆసీస్‌ 123కే ఐదు వికెట్లు చేజార్చుకున్నది.

ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మొదటి బంతికే డేంజర్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(6) వెనుదిరిగాడు. మార్కస్‌ స్టాయినీస్‌(43)  కొంతసేపు దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు నిలువలేదు. ప్రస్తుతం మిచెల్‌ మార్ష్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆతిథ్య బౌలర్లు పదునైన బంతులతో కంగారూలను వణికిస్తున్నారు. 35 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ 5వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌(36), మిచెల్‌ మార్ష్‌(45) క్రీజులో ఉన్నారు. 


logo