సోమవారం 13 జూలై 2020
Sports - Apr 04, 2020 , 00:27:30

డాక్టర్లు, పోలీసులపై దాడులు బాధాకరం

డాక్టర్లు, పోలీసులపై దాడులు బాధాకరం

కరోనా వైరస్‌పై అలుపెరగకుండా పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులపై దాడులు చాలా బాధాకరమని భారత యువ అథ్లెట్‌ హిమాదాస్‌ అంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన ప్రత్యేక కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హిమ ఆ తర్వాత ఓ వీడియోను విడుదల చేసింది. ‘ కొవిడ్‌-19 వైరస్‌తో పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడులు చేయడంపై నేను చాలా బాధపడ్డాను. విధి నిర్వహణలో ప్రాణాలను కూడా లెక్కచేయని వారిపై ఇలాంటి దాడులు గర్హనీయం. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని హిమ అంది. 


logo