గురువారం 09 జూలై 2020
Sports - Apr 30, 2020 , 08:22:21

ఏటీపీ-డ‌బ్ల్యూటీఏ క‌లిపేస్తే మంచిదే: హ‌లెప్‌

ఏటీపీ-డ‌బ్ల్యూటీఏ క‌లిపేస్తే మంచిదే: హ‌లెప్‌

న్యూఢిల్లీ: మ‌హిళ‌ల టెన్నిస్ అసోసియేష‌న్ (డ‌బ్ల్యూటీఏ), అసోసియేష‌న్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెష‌న‌ల్ (ఏటీపీ)ల‌ను క‌లిపేస్తే ఆట‌కు మ‌రింత వ‌న్నె చేకూరుతుంద‌ని.. ప్ర‌పంచ మాజీ నంబ‌ర్‌వ‌న్ సిమోనా హ‌లెప్ పేర్కొంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో.. ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు ఈ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చితే బాగుంటుంద‌ని అంటున్నారు. టెన్నిస్ దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌రర్ గ‌త వారం పురుషుల‌, మ‌హిళ‌ల టోర్నీల‌ను క‌లిపేయ‌డం మంచిద‌ని పేర్కొన్న విష‌యం తెలిసింది. 

ఈ ప్ర‌తిపాద‌న‌కు మ‌హిళా టెన్నిస్ స్టార్ పెట్రో క్విటోవా కూడా వ‌త్తాసు ప‌లికింది. `ఈ రెండింటిని క‌లిపేస్తే ఆట‌కు బ‌హుళ ప్ర‌యోజ‌నం చూకూరుతుంద‌ని నా భావ‌న‌` అని హ‌లెప్ చెప్పింది. ప్ర‌స్తుతం ఇత‌ర క్రీడల‌తో పోల్చుకుంటే టెన్నిస్‌లో పురుషుల‌కు, మ‌హిళ‌ల‌కు స‌మాన ఆద‌ర‌ణ ఉన్న విష‌యం తెలిసిందే. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రైజ్‌మ‌నీల్లోనూ ఈ రెండు విభాగాల్లో విజేత‌ల‌కు స‌మాన న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తున్నారు.


logo