గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 31, 2020 , 02:14:48

మోహన్‌ బగాన్‌ X కేరళ బ్లాస్టర్స్‌

మోహన్‌ బగాన్‌ X కేరళ బ్లాస్టర్స్‌

మార్గవో: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. వచ్చే నెల 20 నుంచి లీగ్‌ మొదలవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌, కేరళ బ్లాస్టర్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. బెంగాల్‌లో ప్రముఖ క్లబ్‌గా పేరొందిన మోహన్‌బగాన్‌..ఏటీకేతో కలిసి బరిలోకి దిగుతుండగా, ఈస్ట్‌ బెంగాల్‌ ఈసారి ఐఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేస్తున్నది. లీగ్‌లో మొత్తం 11 జట్లు పోటీపడుతున్నాయి. కొవిడ్‌-19 దృష్ట్యా మ్యాచ్‌లన్నీ గోవాలోని మూడు స్టేడియాల్లో జరుగనున్నాయి.