బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 00:02:05

ఏటీకే అదుర్స్‌

ఏటీకే అదుర్స్‌

మార్గావ్‌: ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్‌లో ఏటీకే మోహన్‌ బగాన్‌ దూసుకెళుతున్నది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-0 తేడాతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీని మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. 51వ నిమిషంలో రాయ్‌కృష్ణ గోల్‌ చేయడంతో ఏటీకే ఖాతా తెరిచింది. 58వ నిమిషంలో నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్‌ బెంజామిన్‌ పొరపాటున సెల్ఫ్‌గోల్‌ చేయడంతో ఏటీకే ఆధిక్యం రెట్టింపైంది. మరో మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ 3-1 తేడాతో ఒడిశాపై గెలిచి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 


logo