మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 11:44:18

‘ద్రోణాచార్య’ అందుకోబోయే వేళ.. గుండెపోటుతో మృతి

‘ద్రోణాచార్య’ అందుకోబోయే వేళ.. గుండెపోటుతో మృతి

న్యూఢిల్లీ : ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ పురుషోత్తమ్ రాయ్ (79) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.  ‘జాతీయ క్రీడా పురస్కారాల కోసం రిహార్సల్స్‌లో పాల్గొన్న ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారని’ ఏఎఫ్‌ఐ ఉన్నతాధికారి తెలిపారు. ఆయనకు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం శనివారం కరోనా మహమ్మారి సంక్రమణంలో వర్చువల్‌ విధానంలో జరుగనుంది. రాయ్‌ ద్రోణాచార్య అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి లైఫ్‌టైమ్‌ కేటగిరిలో అందుకోవాల్సి ఉంది. పురుషోత్తమ్‌ రాయ్‌ వద్ద కోచింగ్‌ తీసుకున్న వారిలో అగ్రశ్రేణి అథ్లెట్లు ఒలింపియన్‌ క్వార్టర్ మైలర్‌ వందన రావు, హెప్టాట్‌లెట్‌ ప్రమీలాయప్ప, అశ్విని నాచప్ప, మురళీ కుట్టన్, ఎంకే ఆశా, ఈబీ షైలా, రోజా కుట్టీ, జీజీ ప్రమీల ఉన్నారు. ‘ఇది ఏఎఫ్‌ఐకి ఒక విషాధకరమైన సంఘటన అని. ఆయన మరణంతో దిగ్ర్భాంతికి గురయ్యాం’ అథ్లెటిక్స్ కోసం తన జీవితమంతా పని చేశాడని, భారతీయ అథ్లెటిక్స్‌ ఎనలేని కృషి చేశాడు. ఆయన మృతికి సంతాపం తెలిజేస్తున్నాం’ అని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా అన్నారు.

1974లో నేతాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత రాయ్ తన కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆయన ఒక మంచి కోచ్‌. ఆయన కింద పలువురు అగ్రగ్రేణి భారత అథ్లెట్లు శిక్షణ పొందారు. అవార్డు అందుకోవడానికి ఒక రోజు ముందు ఇది చాలా విషాదకరమైన సంఘటన’ అని భారత అథ్లెటిక్స్‌లో గొప్ప వారిలో ఒకరైన మాజీ లాంగ్ జంపర్ అంజు బూబీ జార్జ్ అన్నారు. 1987 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్, 1988 ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్స్, 1999 ఎస్‌ఏఎఫ్‌ గేమ్స్ కోసం కూడా రాయ్ భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆయన ఎట్ సర్వీసెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూత్ ఎంపవర్ మెంట్ స్పోర్ట్స్ (డియెస్), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) వద్ద కోచింగ్‌ను కొనసాగారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo