మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 00:24:34

కొత్తకొత్తగా అవార్డుల కార్యక్రమం

కొత్తకొత్తగా అవార్డుల కార్యక్రమం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీద అందుకోవడమనేది ప్రతి ఒక్క ప్లేయర్‌ కల. కానీ కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ క్రీడా అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్‌ విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..అవార్డులు అందజేయనున్నారు. కొవిడ్‌-19 దృష్ట్యా ఎంపిక చేసిన సాయ్‌ కేంద్రాల్లో విజేతలు అవార్డులను ఆన్‌లైన్‌లో అందుకోనున్నారు. దీని కోసం శుక్రవారం కొన్ని కేంద్రాల్లో రిహార్సల్స్‌లో అథ్లెట్లు పాల్గొన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ద్యుతీచంద్‌ కోల్‌కతాలో హాజరైతే..లోవ్లీనా, సందేశ్‌ చండీగఢ్‌లో రిహార్సల్స్‌లో భాగమయ్యారు.  


logo