గురువారం 09 జూలై 2020
Sports - May 31, 2020 , 22:55:55

ఈసారి కూడా ఇబ్బంది పెడుతా: ఇషాంత్‌

ఈసారి కూడా ఇబ్బంది పెడుతా: ఇషాంత్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత టెస్టు జట్టులో అందరికంటే సీనియర్‌ ఆటగాడైన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. ఈ స్థాయిలో ఆటను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు. కెరీర్‌ 97 టెస్టు మ్యాచ్‌లాడిన ఇషాంత్‌.. నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించడం విశేషం. క్రితంసారి (2018)లో టీమ్‌ఇండియా చరిత్రలో మొదటిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గిన జట్టులో ఇషాంత్‌ కూడా సభ్యుడే. కెరీర్‌ ఆరంభంలో అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఇషాంత్‌ ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను కైడా ఇబ్బంది పెట్టాడు. 2017 భారత పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు ఇప్పటికి అభిమానులకు గుర్తే. స్మిత్‌కు బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఇషాంత్‌ విచిత్రమైన హావాభావాలతో తలను అటు ఇటూ ఊపుతు గుడ్లు తేలేసిన విషయం తెలిసిందే. 

కరోనా ప్రభావంతో క్రీడాటోర్నీలన్నీ రద్దు కావడంతో ఇండ్లకే పరిమితమైన ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సహచర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో లైవ్‌లో మాట్లాడిన ఇషాంత్‌ తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. ఈ ఏడాది జరుగనున్న ఆసీస్‌ పర్యటనలోనూ స్మిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తానని ఇషాంత్‌ చెప్పుకొచ్చాడు. విరాట్‌ కోహ్లీ దూకుడుగల కెప్టెన్‌ అని అతడి సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుందని లంబూ పేర్కొన్నాడు.  


logo