ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 20:12:02

RR vs MI: దూకుడుగా ఆడుతున్న ముంబై

RR vs MI: దూకుడుగా ఆడుతున్న ముంబై

అబుదాబి: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ దూకుడుగా ఆడుతోంది. పవర్‌ప్లే ఆఖరికి వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది.  స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(6) తొలి ఓవర్‌లో వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న డికాక్‌ బౌల్డ్‌ అయ్యాడు.  వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ జోరుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

యువ ఓపెనర్‌ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. 8 ఓవర్లకు ముంబై వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం కిషన్‌(27), సూర్యకుమార్‌(26) క్రీజులో ఉన్నారు. కుదురుకున్న జోడీ భారీ స్కోరు అందించాలని పట్టుదలతో ఉంది.