శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 10:29:55

NZvIND:ఫీల్డర్‌గా కివీస్‌ అసిస్టెంట్‌ కోచ్‌

NZvIND:ఫీల్డర్‌గా కివీస్‌ అసిస్టెంట్‌ కోచ్‌

మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోంచి కివీస్‌ తరఫున చివరిసారిగా 2017లో మ్యాచ్‌ ఆడాడు.

ఆక్లాండ్‌:  భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆతిథ్య జట్టు సహాయ కోచ్‌ ఫీల్డర్‌.. అవతారం ఎత్తాడు.   కివీస్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ ల్యూక్‌ రోంచి మైదానంలో ఫీల్డింగ్‌కు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్‌ జట్టులోని ఆటగాళు ్ల ఫిట్‌గా లేకపోవడంతో  భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా రోంచి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా ఈడెన్‌ పార్క్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. బ్లాక్‌క్యాప్స్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన విషయం తెలిసిందే. మరికొంత మంది  ఆటగాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  

కుగెలీన్‌ జ్వరంతో ఇబ్బందిపడుతుండగా.. మిచెల్‌ సాంట్నర్‌ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వీరిద్దరూ రెండో వన్డే మ్యాచ్‌ ఆడలేదు.  సాంట్నర్‌ స్థానంలో చాప్‌మన్‌ జట్టులోకి రాగా.. జేమీసన్‌ వన్డేలకు అరంగేట్రం చేసి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు.  అనారోగ్యం కారణంగా సౌథీ తన కోటా ఓవర్లు పూర్తి చేసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు.   రిజర్వ్‌ ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడంతో  37వ ఓవర్లో రోంచి ఫీల్డింగ్‌కు వెళ్లకతప్పలేదు.  మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోంచి కివీస్‌ తరఫున చివరిసారిగా 2017లో మ్యాచ్‌ ఆడాడు. logo